మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పరికిబండ గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో గ్రామస్థులు నిరసన చేపట్టారు. అసలైన అర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకుండా అర్హులు కాని వారికి పథకాలు మంజూరు చేస్తున్నారంటూ సభలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు.