*జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవికి అవకాశం కల్పించండి*
*రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం* *పార్టీని అంటిపెట్టుకొని ఉన్న కార్యకర్తలు కోడం రజిత- శ్రీనివాస్*
*జమ్మికుంట/ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 8*
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సి మహిళా రిజర్వేషన్ అయినందున చైర్మన్ పదవికి అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఇల్లందకుంట మండల మహిళా అధ్యక్షురాలు కోడం రజిత శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు రజిత శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన పాతర్ల పెళ్లి గ్రామానికి చెందిన సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నేను విద్యావంతురాలని పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ గత 20 సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కొరకు అనేక గ్రామాలలో తిరగడం జరిగిందని ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల సభ్యురాలుగా 2013లో వార్డు సభ్యురాలుగా 2018లో ఇల్లంతకుంట జడ్పిటిసి సభ్యురాలుగా నామినేషన్ వేయడం జరిగిందని పార్టీ ఆదేశాలతో విరమించుకోవడం జరిగిందని 2018లో మహిళా ప్రధాన కార్యదర్శిగా 2021 లో మండల అధ్యక్షురాలుగా కొనసాగుతున్నానని తెలిపారు నాకు పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు నా శాయశక్తుల పార్టీ కోసం కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు పని చేసి హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నానని తెలిపారు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అవకాశం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వం పెళ్లి సత్యనారాయణ ను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి ప్రణవ్ ను కలిసి కోరడం జరిగిందని తెలిపారు