ఆధునిక సాగు పద్ధతులను పరిశీలించిన అగ్రికల్చర్ విద్యార్థులు

నర్సాపూర్, నవంబరు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): రైతు నేస్తం కార్యక్రమంలో ఆధునిక సాగు పద్ధతులను మల్లారెడ్డి అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు మంగళవారం “రైతు నేస్తం” వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని పలు ఆధునిక సాగు సాంకేతికతలను పరిశీలించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మక్కజొన్న, పొద్దుతిరుగు పువ్వు, ఆముదం పంటల్లో అమలవుతున్న జీరో–టిల్లేజ్ విధానాలు, వాటి లాభాలు, ప్రభావాలు గురించి నిపుణులు విద్యార్థులకు విశదీకరించారు. మిరప పంటలో వ్యాపించే హానికర కీటకాలు, వాటి వల్ల కలిగే నష్టం, వాటి నిర్వహణా విధానాలను కూడా వివరించారు. జీరో–టిల్లేజ్ ద్వారా నేల భుజబలం మెరుగుపడటం, తేమ నిల్వ ఎక్కువకాలం ఉండటం, సాగు ఖర్చులు మరియు ఇంధన వినియోగం తగ్గడం, కార్మిక శ్రమ ఆదా కావడం వంటి ప్రయోజనాలను విద్యార్థులు ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. ఈ పద్ధతులు నేల ఆరోగ్యాన్ని బలోపేతం చేసి సేంద్రియ కార్బన్‌ను పెంచుతాయని నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ రైతు వేదిక సభ్యులు, తెలంగాణ రైతు రక్షణ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మిర్యాల చంద్రశేఖర్ గుప్తా, ఏఈఓ మోహన్, విద్యార్థులు సిరి వర్ష, త్రిశల, యశశ్రీ, ఏ.వైష్ణవి, వినూత్న, ఎం.వైష్ణవి, జాహ్నవి, జయ, పవనీ, జాగృతి, వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now