రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రైతుబంధు, సాగునీరు, తాగునీటిని వెంటనే అందించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.
రెండు సీజన్ల నుండి రైతుబంధు అందలేదని, ప్రభుత్వం వెంటనే రైతు భరోసా మొత్తాన్ని చెల్లించాలని బీజేపీ మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి కుమార్ అన్నారు. మల్లన్న సాగర్ 12వ ప్యాకేజీ ద్వారా నీటిని అందిస్తూ, పెండింగ్ లో ఉన్న కాలువ మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
రాబోయే వేసవిలో రైతులకు సాగునీరు అందించాలని, ముస్తాబాద్ లింగనికుంట ద్వారా తాగునీటితో పాటు సాగునీటిని కూడా అందించాలని కోరారు.
ఈ మేరకు స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

