ఏఐసిసి మరియు ముఖ్యమంత్రి ల నిర్ణయాన్ని వ్యతిరేకించే ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలి

*ఏఐసిసి మరియు ముఖ్యమంత్రి ల నిర్ణయాన్ని వ్యతిరేకించే ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలి*

 ఖమ్మం : రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పిడమర్తి రవి , వక్కల గడ్డ సోమచంద్రశేఖర్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు చేవెళ్ల డిక్లరేషన్ లో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కరిగే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని హామీ ఇచారు . ఆ హామీతో రాష్ట్రంలోనే అతిపెద్ద కులమైన మాదిగ సామాజిక వర్గం 12 శాతం పార్టీ గెలుపు కొరకు కృషి చేశారు . ఆ తదుపరి సుప్రీంకోర్టు ధర్మాసనం 6 1 జడ్జీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాల వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చినారు తిరిగి మాల సోదరులు సుప్రీం ధర్మాసనం ముందు రివ్యూ పిటిషన్ వేయగా 7 జడ్జీల ధర్మాసనం ఏకగ్రీవంగా పిటీషన్ను అనుమతించక కొట్టేసినారు . ఇక ఈ విషయంలో ఎటువంటి కోర్టుకు వెళ్లే అవకాశాలు లేదు అయినను గత కొన్ని రోజులుగా మాదిగ జాతి ఓట్లతో గెలిచిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వర్ధన్నపేట , ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు మరియు రాష్ట్రంలో కీలకమైన బాధ్యతల్లో ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు తెర వెనక ఉండి రాష్ట్రవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మరియు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు . కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు వీరిపై లోక్సభలో ప్రతిపక్ష నాయకులు   రాహుల్ గాంధీ కి ఏఐసిసి అధ్యక్షులు   మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు . వారి పద్ధతులు మార్చుకోవాలని తల్లి లాంటి పార్టీ నిర్ణయాన్ని శిరసావించాలని ఇష్టం లేకపోతే పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోవాలని అదేవిధంగా శాసన సభ్యత్వాలకు కూడా రాజీనామా చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు మాదిగ జాతి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని తెలిపారు . అదేవిధంగా మధిరలో 60 వేలకు పైగా ఖమ్మం పాలేరు సత్తుపల్లి వైరా నియోజకవర్గాల్లో 50 వేలకు పైగా మాదిగ ఓటర్లు గెలుపు ఓటములు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని పైగా ఎస్సీ ఎస్టీ సీట్లలో వారి యొక్క ప్రాతినిధ్యం కొరకే సీట్లను కేటాయించారు కానీ ఖమ్మం జిల్లాలో మాదిగలేనట్లుగా మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేశారు . ఖమ్మం జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో మాల ఉపకలాలకు చెందినవారు ఎమ్మెల్యేలుగా ఉన్నారని వాపోయారు . దీని వలన ఖమ్మం జిల్లాలో పార్టీలో మరియు చట్టసభలలో నామినేటెడ్ పదవుల్లో ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా పోయిందని దళితులలో 75% మాదిగ జాతి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన చెందారు . ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు మరియు శాసనసభ్యులు గెలుపులు ఎంతో కీలకంగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీలుగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా దేవాలయ పాలక మండలి చైర్మన్గా టి పి సి సి మరియు డిసిసి కార్యవర్గాల్లోనూ మరియు జిల్లాస్థాయి నామినేటెడ్ పదోలను కల్పించి ఖమ్మం జిల్లా మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో న్యాయం చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లాలని వినమ్రముగా వేడుకొన్నారు . ఈ సమావేశంలో మాదిగ సామాజిక వర్గ కాంగ్రెస్ నాయకులు మట్టె గురుమూర్తి , తోళ్ళ రాకేష్ , కష్టాల క్రాంతి , దూడ అర్జున్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now

Leave a Comment