Headlines :
-
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రభుత్వానికి పిర్యాదు
-
వరి ధాన్యం కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేయాలి
-
రైతుల మద్దతు ధర పెంచాలని డిమాండ్
-
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు
-
అకాల వర్షాల ప్రభావం: రైతులకు ఉన్న ఇబ్బందులు
*వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయాలి, తక్షణమే మిల్లులు అలాట్ చేయాలి*
*అన్నిరకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలి*
*దళారులు, రైస్ మిల్లర్ల నుండి రైతులను కాపాడాలి*
*అకాల వర్షాలకు తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలి*
*జిల్లా కలెక్టర్ కి ఏఐఎఫ్ బి జిల్లా కమిటీ పిర్యాదు*
*కరీంనగర్ నవంబర్ 4 ప్రశ్న ఆయుధం::-*
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు జి ప్రశాంత్ కుమార్ కె బద్రి నేత, యూతులకు జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి లతో కలసి ప్రజావాణిలో జిల్లాలో వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయాలిని, తక్షణమే మిల్లులకు అలాట్ చేయాలని అన్నిరకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని దళారులు, రైస్ మిల్లర్ల నుండి రైతులను కాపాడాలని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి పిర్యాదు చేశారు
అనంతరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ వరి ధాన్యం కేంద్రలు ఏర్పాటు చేసిన కొనుగోలు స్టార్ట్ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుందని దీనితో దళారులను రైతులు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం యంత్రాంగం రైతులను రైస్ మిల్లర్ల నుండి దళారుల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు అన్నిరకాల వరిధాన్యానికి రూ. 500 బోనస్ కల్పించాలని అకాల వర్షానికి తడిసిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు
కరీంనగర్ జిల్లాలో వరి కోతలు మొదలు అయినవి కొనుగోలు కేంద్రాలో ప్రారంభించారు కానీ కొన్ని చోట్ల మిల్లులు అలాట్ చేయకపోవడంతో ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దించుకోకపోవడంతో ఎక్కడికక్కడే లారీలల్లో, కలల్లో ధాన్యం పేరుకుపోతున్నదని కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్న కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చాలాచోట్ల ప్రారంభం కాలేదని తక్షణమే వడ్ల కొనుగోళ్లను ప్రారంభించాలని అకాల వర్షాలతో తడిసిన ధాన్యానికి మద్దతు ధర కల్పించలని వరి ధాన్యాన్ని కల్లాల్లో రైతులు అరబోసు కుంటున్నారని కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకే వడ్లను అమ్ముకుంటున్నారని దళారుల నుండి రైతులను కాపాడాలని రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని వీలైనన్ని ఎక్కువ చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చేతికందొచ్చిన పంట ధాన్యాన్ని వర్షానికి తడవకుండా చూడాలని కోరారు అకాల వర్షాలు వల్ల కళ్ళలోకి వచ్చిన ధాన్యాన్ని రైతులు కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం టార్పాలిన్లు (తాటిపత్రిలు) అందుబాటులో ఉంచాలని అలాగే తాలు తప్ప తరుగు లేకుండా మద్దతు ధర కల్పించాలని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా వరిధాన్యానికి 500 బోనస్ కల్పించాలని సన్నవరిధాన్యానికి మాత్రమే బోనస్ కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్నదని కానీ హామీ ఇచ్చిన విధంగా అన్నిరకాల వరిధాన్యానికి బోనస్ కల్పించాలని పేర్కొన్నారు ఎప్పటికి అప్పుడు ధాన్యాన్ని తరలించడానికి గోనె సంచులు కొరత లేకుండా చూడాలని, ముందస్తుగానే తెప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లు సెంటర్ కు 5 నుండి 10 మాత్రమే పంపిస్తున్నారని కొన్ని చోట్ల అవికూడా అందుతలేవని టార్పాలిన్లు లేకపోతే రైతులు అద్దెకు తెచ్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోనె సంచులు కొరత తీవ్రంగా ఉన్నదని ఇవి లేకపోవడంతో గతంలో రైతులు సెంటర్ల వద్ద తీవ్ర ఇబ్బందులు పడ్డారని ముందస్తుగానే ఎలాంటి కొరత లేకుండా చూడాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుఈ కార్యక్రంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి. ప్రశాంత్ కుమార్ బద్రి నేత యూత్ లీగ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.