రన్‌వేపై అదుపుతప్పిన ఎయిర్ ఇండియా విమానం
ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున కొచ్చి నుంచి వచ్చిన AI 2744 విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై అదుపుతప్పింది. భారీ వర్షాల కారణంగా ఇది జరిగిందని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం విమానాన్ని తనిఖీకి తరలించారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.