భారీగా పెరిగిన ఎయిర్‌టెల్ లాభం
దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,593 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల లాభం రూ.1,341 కోట్లతో పోలిస్తే, ఇది దాదాపు 3 రెట్లు (168%) అధికం. కంపెనీ ఆదాయాలు 12% అధికమై రూ.41,473 కోట్లకు చేరాయి. భారత్, ఆఫ్రికా వ్యాపారాల ఆకర్షిణీయ పనితీరు ఇందుకు దోహదం చేసింది. ఎయిర్‌టెల్ భారత కార్యకలాపాల విభాగ ఆదాయం రూ.31,561 కోట్లుగా నమోదైంది.