Site icon PRASHNA AYUDHAM

ఘనంగా ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

IMG 20250812 183320

Oplus_131072

సంగారెడ్డి, ఆగస్టు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నాడు ఎఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఆ సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఎఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ శ్వేత అరుణ పతాకాన్ని ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దత్తురెడ్డి ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చెర నుంచి మాతృభూమి విముక్తికై 1936 ఆగస్టు 12న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావించి దేశ స్వాతంత్రోద్యమంలో అసమాన పోరాటాలు నిర్వహించి, ఎంతో మంది విద్యార్థులను త్యాగం చేసిందని కొనియాడారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్ర్య అనంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 89 సంవత్సరాలుగా విద్యార్ధుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా – పోరాటాలే ప్రాణంగా విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యారంగ సమస్యలపై చదువు-పోరాడు అంటూ దేశ వ్యాపితంగా ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని, అన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసిందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసిన సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. ఎంతో మంది రాజకీయ వేత్తలను, మేధావులను అందించిన చరిత్ర ఎఐఎస్ఎఫ్ కు ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు లింగం, ఇసాక్, రాకేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version