*బీసీ బాలుర బాలికల హాస్టళ్లకు నూతన భావాలు నిర్మించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి*
*అద్దె భవనాల్లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు*
*ఒడితల ప్రణవ్ బాబు కి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు వినతి*
*హుజురాబాద్ నవంబర్ 7 ప్రశ్న ఆయుధం::-*
హుజూరాబాద్ నియోజకవర్గంలో బిసి బాలుర, బాలికల హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని ప్రభుత్వంకి ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నూతన భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య( ఎఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఒడితల ప్రణవ్ బాబు కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న సంక్షేమ బిసి బాలుర బాలికల హాస్టల్స్ అద్దె భవనాల్లో నడుస్తున్నాయని అలాగే హుజురాబాద్ నియోజకవర్గంలో గల వీణవంక గురుకుల సైదాపుర్ గురుకులాలు హుజురాబాద్ మండల కేంద్రంలో రైస్ మిల్లుల మధ్యలో ఉన్నాయని తెలిపారు. దీనివల్ల రైస్ మీల్లుల ద్వారా వచ్చే పోగా వలన చర్మ సమస్యలు శ్వాశకోశ సమస్యలు వస్తున్నాయని అలాగే బిసి బాలికల సంక్షేమ హాస్టళ్లు మెన్ రోడ్డు పక్కన ఉన్నాయని విద్యార్థులు పాఠశాల కు వేళ్లి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హాస్టళ్లలో చదివే విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కాబట్టి పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని కనుక ప్రభుత్వం దృష్టికి మంత్రి దృష్టికి తీసుకెళ్లి వేంటనే నూతన భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, మండల అధ్యక్షుడు దోమ్మాటి వేణుగోపాల్, మండల సహాయ కార్యదర్శి రాంపేల్లి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.