సివిల్ సప్లై అధికారి బిక్షపతి కి సమ్మె నోటీసు ఇచ్చిన ( ఏఐటీయూసీ ) సివిల్ సప్లై హమాలి నాయకులు. 

సివిల్ సప్లై అధికారి బిక్షపతి కి సమ్మె నోటీసు ఇచ్చిన ( ఏఐటీయూసీ ) సివిల్ సప్లై హమాలి నాయకులు.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

( ప్రశ్న ఆయుధం) జులై 2

 

 

దేశవ్యాప్తంగా ఈనెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో తాము పాల్గొంటున్నామని కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారి బిక్షపతి కి సమ్మె నోటీసు ను సివిల్ సప్లై అమాలి ( ఏఐటీయూసీ ) నాయకులు బుధవారం జిల్లా కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి బాలరాజు మాట్లాడుతూ దేశవ్యాప్త సార్వత్రికసమ్మె ఈనెల 9వ తేదీన భారతదేశంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, అన్ని రకాల కార్మికులు పాల్గొంటారన్నారు. అలాగే సివిల్ సప్లై అమాలి కామారెడ్డి జిల్లా కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ, సదాశివ నగర్, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం జిల్లావ్యాప్తంగా 7 ఎమ్మెల్యే ప్యాంట్ల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ సమయం కార్మికులకు కనీస వేతనాలు, పని భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, మహిళా కార్మికులకు పని భద్రత, వీటితోపాటు జిల్లాలో సొంత గోదాములు నిర్మించాలని గోధుమల దగ్గర కార్మికులకు వర్షానికి ఎండకు సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు. సివిల్ సప్లై అమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్ విధానం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, ఎనిమిది గంటల నుండి పని 12 గంటలు పెంచుతున్న పనిభారాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రైవేటు రంగాలకు వ్యవసాయ రంగం కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వము అడుగులు ముందుకు వేస్తుందన్నారు. అందులో భాగంగా అన్ని రంగాలు కార్మికులు ఈనెల 9 వ తేదీన జరిగే దేశభక్త సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అమాలి ఏఐటీయూసీ అనుబంధం, సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్ దశరథ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలరాజు, సివిల్ సప్లై హమాలీ కామారెడ్డి జిల్లా నాయకులు బాజీ, మైపాల్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now