ఈనెల 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
– ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజ్
– కామారెడ్డి
ఈనెల 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం ఇవ్వాలని చేస్తున్న సమ్మెలో కామారెడ్డి మున్సిపల్ కార్మికులము ఆరోజు సమ్మెలో పాల్గొంటున్నామని తమకు సెలవు ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి కి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఏఐటీయూసీ అనుబంధ సంఘం. ఆధ్వర్యంలో ఈనెల 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజ్ మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. పెరిగిన ధరల కనుగుణంగా, సుప్రీంకోర్టు జీవో ప్రకారం వాటర్ వర్క్స్ శానిటేషన్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పిఎఫ్, ఈఎస్ఐ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈనెల 20 న జరిగే సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కామారెడ్డి జిల్లా ( సిఐటియు ) అధ్యక్షులు రాజనర్సు, ఎఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు .ఎల్. దశరథ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజ్, మున్సిపల్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం లక్ష్మణ్, మున్సిపల్ కామారెడ్డి అధ్యక్షులు కార్యదర్శి అయాజ్, నర్సింగరావు, జి రాజు, వై రాజు, సాయి, రూపేష్, అంబిక, శిరీష, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.