Site icon PRASHNA AYUDHAM

శ్రామికుల పక్షాన పోరాడేది ఏఐటీయూసీ

రైతు కార్మికులు ఉత్పత్తి రంగాల వారు కార్మికులే

శ్రమ చేసే వారిని ఐక్యం చేసింది ఏఐటీయూసీ నే

మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ నే

ఏఐటీయూసీ ద్వితీయ మండల మహాసభలో షాబీర్ పాషా

సుజాతనగర్

రైతులు శ్రామికులు ఉత్పత్తి అనుబంధ రంగాలు శ్రమ చేసేవారు అంతా కార్మికుల అని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది ఏఐటీయూసీ మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్.కె షబీర్ పాషా అన్నారు

బుధవారం మండల కేంద్రంలోని రజబ్ అలీ భవన్లో ఏఐటీయూసీ ద్వితీయ మండల మహాసభ దండు నాగేశ్వరరావు వీర్ల మల్లేష్ అధ్యక్షతన జరిగింది

ముందుగా వందలాది కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి సుజాతనగర్ మెయిన్ సెంటర్ లోని ఏర్పాటుచేసిన ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో షాబీర్ పాషా మాట్లాడుతూ గ్రామీణ పేదలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆటో కార్మికులు ఆశా వర్కర్లు మిడ్ డే మీల్స్ అంగన్వాడీలు రైస్ మిల్ హా మాలీలు వ్యవసాయ కార్మికులు సమస్యలపై పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు

గతంలో కార్మికులు పోరాడాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు రైతులు సమస్యలపై పోరాడాల్సివల్సి నా పరిస్థితి ఏర్పడిందన్నారు

రైతులకు గిట్టుబాటు ధర రైతు భరోసా రుణమాఫీ సమస్యలు ప్రభుత్వాలు మారిన సమస్యల పరిష్కరి కాలేదన్నారు

కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అసెంబ్లీలో అన్ని రంగాల కార్మికుల సమస్యలపై మాట్లాడారని తెలిపారు

పెట్రోల్ డీజిల్ లో జీఎస్టీ పరిధిలోకి తేవాలని పెన్షన్లు రేషన్ కార్డులు ఇల్లు అర్హులైన వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు

ఏఐటీయూసీని బలపరచాలని ఎర్ర జెండా నిరంతరం పోరాటాల వల్ల ప్రజా సమస్యలను పరిష్కారం జరుగుతుందన్నారు

 

అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

ప్రభుత్వాలు మారిన ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదని మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు నష్టపోయారని అన్నారు

సెప్టెంబర్ 22వ తేదీన ఆటో యూనియన్ రాష్ట్ర మహాసభలు కొత్తగూడెంలో జరుగుతున్నాయని ఈ లోపు ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించి స్తంభింప చేస్తామని సభా వేదికగా హెచ్చరించారు

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు

కార్మికుల పక్షాన ఎన్నికల ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు

 

అనంతరం ఏఐటీయూసీ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు

ఈ కార్యక్రమంలో

ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి జక్కుల రాములు మాజీ ఎంపీపీ భూక్య పద్మావతి సిపిఐ మండల కార్యదర్శి భూక్యా దస్రు సహాయ కార్యదర్శి కుమారి హనుమంతరావు పొదిల శ్రీనివాసరావు ఏఐటీయూసీ మండల అధ్యక్షులు వీర్ల మల్లేష్ వీర్ల దుర్గాప్రసాద్ మాజీ ఎంపీటీసీలు మురళి గణేష్ రైతు సంఘం నాయకులు తాళ్లూరి పాపారావు నాయకులు బొడ్డు కేశవరావు తాళ్లూరి ధర్మారావు గోపి సురేష్ అంగన్వాడి లు ఆశా వర్కర్స్ మిడ్ డే మీల్స్ ఆటో రవాణా రంగ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అమాలి కార్మికులు పెయింటింగ్ వర్కర్స్ రైతులు కార్మికులు కర్షకులు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version