కామారెడ్డి కమిషనర్ ను సన్మానించిన ఏఐటీయూసీ కార్మికుల సంఘం

కామారెడ్డి కమిషనర్ ను సన్మానించిన ఏఐటీయూసీ కార్మికుల సంఘం

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

కామారెడ్డి పురపాలక సంఘం కమిషనర్ స్పందనను ( ఏఐటియుసి ) కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి పూలమాల బొక్కెలతో ఘనంగా సన్మానించరు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత మూడు నెలలుగా జీతాలు లేక చాలీచాలని వేతనాలతో నెట్టుకు వస్తున్నటువంటి మా పేద కార్మికుల కడుపు నింపిన కమిషనర్ను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. సుమారు కామారెడ్డి మున్సిపాలిటీలో 490 మంది పైచిలుకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారనీ, వీరందరికీ ఏకతాటిపై మూడు నెలల వేతనాలు ఇప్పించడం జరిగిందన్నారు. స్టాంప్ డ్యూటీ పేమెంట్ సుమారు 8 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్మికుల సంక్షేమం కొరకై కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని మూడు నెలల వేతనాలు పిఎఫ్, ఈఎస్ఐ పెండింగ్లో ఉన్నందున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మహమ్మద్ షబ్బీర్అలీ కి ఇట్టి విషయం తెలియజేయడంతో సెక్రటేరియట్లో ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రామకృష్ణారావు తో ఆయన మాట్లాడి మా పేద కార్మికుల బాధను అర్థం చేసుకొని మూడు నెలల వేతనాలు పిఎఫ్, ఈఎస్ఐ, స్టాంప్ డ్యూటీ అమౌంట్ నుంచి ఇవ్వమని చెప్పడం జరిగిందన్నారు. కమిషనర్ స్పందన దీనిపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ ఇచ్చినందుకు కమిషనర్ కు, మహమ్మద్ షబ్బీర్ అలీ కి కార్మికుల పక్షాన ప్రత్యేక మైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఇ, వేణుగోపాల్,

ఏ ఈ, శంకర్, ఎఫ్ బి ఓ, శ్యామ్,

పి హెచ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, కార్మిక సంఘం నాయకులు వి ఎల్, నర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎం లక్ష్మణ్ , మునిసిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు మీర్జా ఆయాజ్ బేగ్ , ప్రధాన కార్యదర్శి ఎన్, నర్సింగ్ రావు, రాజేందర్,ఆర్, లక్ష్మణ్, జి ,రాజు, ఏ, రాజు, వీ, రాజ రెడ్డి వై, ఎల్లమ్మ, యు లక్ష్మి, నర్సలు,లతో పాటు సుమ 2000 మంది కార్మికుల పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment