భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం (ప్రశ్న ఆయుధం) ది:04-01-2025
రైతుల మౌలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్లు ములకలపల్లి మండలం, పాతగుండాలపాడు గ్రామ పంచాయితీ చలమన్న నగర్ గ్రామంలో పోస్టర్లు ఆవిష్కరించటం జరిగింది. ఈ సందర్బంగా అఖిల భారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపికెఎంఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు నూపా భాస్కర్, ప్రగతి శీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలు నూపా సరోజ, అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) ములకలపల్లి మండల అధ్యక్షుడు వెలకం చలమన్న లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందున, సాగు భూములకు రైతు భరోసా ఓకే సారి ఇవ్వాలని, రైతు రుణమాఫీ సమగ్రంగా అమలు చేయాలని, msp చట్ట బద్దం చేసి సమగ్ర ఖర్చుల మీద 50% అధనంగా msp నిర్ణయించాలని, negar లో 200రోజుల పని, రోజుకు 200/- రూ. వేతనం ఇవ్వాలని, వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు మరియు మధ్య తరగతి రైతుల రుణాలు మాఫీ చేయాలని, అటవీ హక్కుల చట్టం 2006 ను సమగ్రంగా అమలు చేసి పొడుభూములకు పట్టాలు ఇవ్వాలని, భూమి లేని వారికి భూమి, ఇల్లు లేని వారికి ఇల్లు, మరియు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం గ్రామ నాయకులు సోయం వెంకటేష్, ఇర్పా రమేష్,కుర్సం పంతులు, ప్రగతి శీల యువజన సంఘం నాయకులు కుర్సం ముకేశ్, కుర్సం నవీన్ తదితరులు పాల్గొన్నారు.