Site icon PRASHNA AYUDHAM

పరుగు పందెంలో పథకం సాధించిన అకిత

IMG 20240921 WA00711

పరుగు పందెంలో పథకం సాధించిన అకిత

ప్రశ్న ఆయుధం, సెప్టెంబర్ 21, కామారెడ్డి :

పదవ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో 3000 మీటర్ల పరుగు పందెంలో కళాశాల విద్యార్థిని ఎం.ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి అకిత బి.ఎస్సి (ఎంపీసీ ద్వితీయ సంవత్సరం) తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుని కాంస్య పథకాన్ని సాధించిందని కళాశాల ఇన్చార్జి పిడి డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు.

చదువుతోపాటుగా కళాశాల విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించటం గొప్ప విషయమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ తెలిపారు. గతంలోనూ 800,1500 మీటర్ల పరుగు పందెం,క్రాస్ కంట్రీ 10 కిలోమీటర్లు, హ్యాండ్ బాల్ తదితర విభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని పథకాలు సాధించి ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచి కళాశాలకు గర్వకారణమైన విద్యార్థిని అకితను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. విజయ్ కుమార్,ఎన్సిసి ఆఫీసర్ లెఫ్ట్నెంట్ డాక్టర్ ఏ. సుధాకర్, ఇన్చార్జి పిడి డాక్టర్ జి.శ్రీనివాసరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్. విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version