కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని నాగచైతన్య..
దయచేసి రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగొద్దని కోరారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని అన్నారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి అని చెప్పారు. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని అన్నారు. తక్షణమే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలని మంత్రి కొండా సురేఖను కోరారు.