*మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో ఇవాళ (గురువారం) విచారణ జరిగింది.*
ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయింది. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ఇందుకు సుప్రియ సాక్ష్యాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్ తరుపు న్యాయవాది వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. *మంత్రి కొండా సురేఖ మీద నాంపల్లి ప్రజా ప్రతినిదుల కోర్టు కేసు నమోదు చేసింది.* నాగార్జున వేసిన పిటిషన్‌ను కాగ్నిజెన్స్‌లోకి కోర్టు తీసుకుంది. మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. *CC నెంబర్ 490/2024, 356BNS యాక్ట్ కింద కొండా సురేఖపై కేసు నమోదు చేసింది.* సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. *డిసెంబర్ 12వ తేదీన వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.*