*ఎంపీ నిధులు కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్*
*జమ్మికుంట జనవరి 8 ప్రశ్న ఆయుధం*

హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హుజురాబాద్ అసెంబ్లీ పరిధిలోని నాలుగు మండలాలకు కేంద్ర ప్రభుత్వ నిధులను మంజూరు చేయడం పట్ల జమ్మికుంట పట్టణానికి చెందిన బిజెపి ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈజీఎస్ నిధుల నుండి కరీంనగర్ పార్లమెంటు అన్ని మండల కేంద్రాలతో పాటు హుజురాబాద్ అసెంబ్లీ లోని నాలుగు మండలాలకు సుమారు 2 కోట్ల 76 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని వారు తెలిపారు. మన జమ్మికుంట మండలoలోని 10 గ్రామాలలో రోడ్లు డ్రైనేజీల పని నిమిత్తం సుమారు 41 లక్షల రూపాయల ఇల్లందకుంట మండలంలోని 15 గ్రామాలకు 60 లక్షల రూపాయలను వీణవంక మండలం లోని గ్రామాలకు కోటి ఐదు లక్షల రూపాయలను నిధులను మంజూరు చేయడం పట్ల ప్రజలు బిజెపి నాయకులు ఆనందo వ్యక్తం చేశారు.ఇంకా త్వరలో పెండింగ్ పనులు జాబితా తయారు చేసి మళ్లీ నిధులు మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ తెలిపారు.
Post Views: 19