కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్..​!

కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్​!

తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందే!!

కొత్త రేషన్​కార్డుదారలు ఈ-కేవైసీ చేసుకోవాలంటున్న అధికారులు

సమీపంలో రేషన్​షాప్​నకు వెళ్లి వేలిముద్రలు అప్​డేట్​ చేసుకోవాలని సూచన

బినామీలకు చెక్​ పెట్టేందుకే ఈకేవైసీ నిబంధన

* ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డులను జారీ చేసిన సంగతి తెలిసిందే

* కార్డులు పొందిన వారు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని అధికారులు చెబుతున్నారు

* కొత్త రేషన్​ కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరు సమీపంలోని రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ-పాస్‌ యంత్రంలో బయోమెట్రిక్‌ వేలిముద్రలను (ఫింగర్​ ప్రింట్​లను) అప్‌డేట్‌ చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు

* ప్రతి ఒక్కరు ఈ-కేవైసీ నమోదు చేయించుకోవాలని గత రెండేళ్ల నుంచి సర్కారు పలుమార్లు పేర్కొంది

* గడువు పెంచుకుంటూ వెళ్తోంది

* కామారెడ్డి జిల్లాలో 26,521 కొత్త రేషన్‌కార్డులు మంజూరయ్యాయి

* వారికి సెప్టెంబరు నెలలో కోటా బియ్యం కూడా విడుదల చేశారు

* 40 వేల మంది కుటుంబ సభ్యులకు సంబంధించి పేర్లను పాత కార్డుల్లో జమ చేశారు వీరు కూడా ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది

అందుకే కేవైసీ నిబంధన

* జిల్లాలో ప్రస్తుతం 2,83,253 రేషన్‌కార్డులు ఉండగా అందులో 86 శాతం మంది ఈ-కేవైసీ చేయించుకున్నారు

* మిగతా కార్డుదారులు త్వరగా చేయించుకోవాల్సి ఉంటుంది

* ఈ-కేవైసీ చేయించుకోని వారికి బియ్యం బంద్‌ చేస్తామని కేంద్రం గతంలో పేర్కొంది

* ఎందుకంటే ఆధార్‌కు ఈ-పాస్‌ యంత్రానికి అనుసంధానం చేయడం వల్ల బినామీలు బియ్యం తీసుకోవడానికి వీలుండదు. అందుకే కేవైసీ నిబంధన విధించారు

నవీకరణ లేకపోవడంతో ఆలస్యం

* ఆధార్‌ అప్‌డేట్‌ లేకపోవడం వల్ల కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి

* వీరు ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి అప్​డేషన్​ ప్రక్రియను పూర్తి చేయించుకున్నప్పటికీ ఈ-కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు

* ఇదేంటని ఇతర ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి తెలుసుకుంటే ఆధార్‌ నవీకరణ పూర్తి కాకపోవడం వల్ల ఈ-కేవైసీ తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు

* దీంతో లబ్ధిదారులు వేర్వేరు ఆధార్‌ సర్వీస్​ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు

* ఆధార్‌ నవీకరణ పూర్తికాకపోవడం వల్ల చిన్నారులు ఈ-కేవైసీకి దూరమవుతున్నారు

ఆధార్‌ కేంద్రాలు తక్కువ

* కామారెడ్డి జిల్లాలో ఆధార్‌ కేంద్రాలు తక్కువ ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

* దీంతో ఆధార్‌ సెంటర్లు లేని మండలాల ప్రజలు ఇతర మండలాలకు వెళుతున్నారు

* అధికారులు స్పందించి కనీసం మండలానికి ఒక ఆధార్‌ కేంద్రాన్ని అయినా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు

* గడిచిన ఏడాదిగా జిల్లాలో ఐదారు ఆధార్‌ కేంద్రాల సర్వీసులను నిలిపివేశారు

* జిల్లాలో 25 మండలాలు ఉండగా 10 ఆధార్‌ సెంటర్లు మాత్రమే కొనసాగుతున్నాయి

* మిగతా మండలాల్లో మాత్రం ఆధార్‌ కేంద్రాలు లేవు

* ఈ విషయమై డీఎస్‌వో మల్లికార్జున్‌బాబు మాట్లాడుతూ.. కొత్తకార్డుదారులు ఈ-కేవైసీ చేయించుకుంటే వారికే మంచిదని వివరించారు

* రేషన్ కేంద్రాల్లో చాలా మందికి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తికావడం లేదు

* దీనికి రేషన్​కార్డుదారులు ఆధార్ నవీనీకరణ (అప్​డేట్)​ చేసుకోకపోవడమే కారణమని డీలర్లు చెబుతున్నారు

* దీంతో ప్రజలు ఆధార్ కేంద్రాలకు అప్​డేట్​ కోసం పరుగులు తీస్తున్నారు

* అయితే ఆధార్ కేంద్రాలు తగినన్ని లేకపోవడం వల్ల ఉన్న కొద్దిపాటి కేంద్రాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు

* చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఇటు రేషన్ కేంద్రాల చుట్టూ అటు ఆధార్ కేంద్రాల చుట్టూ అప్​డేట్​ కోసం​ తిరుగుతున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment