సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాలుగు రోజులపాటు జరిగే ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ఝరాసంఘం కేతకి సంగమేశ్వర స్వామి జాతరకు సంబంధించి ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో జాతరలో చేస్తున్న ఏర్పాట్లను అధికారులు కలెక్టర్ వివరించారు. జాతరకు సుమారు రెండు లక్షల పైచిలుకు భక్తులు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ల నుండి వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల రద్దీకి అనుగుణంగా జాతర ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జాతర సందర్భంగా ఆర్టీసీ అధికారులు ఆయా రూట్లలో ప్రత్యేక బస్సు సర్వీస్ లో నడపాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో జాతర కు ప్రజలు వచ్చే మార్గాలలో రోడ్ల మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. గ్రామీణ మంచినీటి సరఫరా మిషన్ భగీరథ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి వసతి ఏర్పాట్లు, పంచాయతీ రాజ్ శాఖ తరుపున మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లకు అవసరమైన మరమత్తు పనులు చేపట్టడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు సైతం ఏర్పాటు చేయాలని, రన్నింగ్ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో జాతరలో శానిటేషన్ పనులు పర్యవేక్షించాలన్నారు.జాతర సమయంలో జాతర పూర్తయిన తర్వాత జాతర జరిగిన ప్రదేశం మొత్తం శానిటేషన్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆలయపు సమీపంలో భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని చాలువ పందేలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బద్దో బస్సులు ఏర్పాటు చేయాలని నిరంతరం సీసీ కెమెరాలుతో జాతరలో నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలని, జాతరకు వచ్చే ప్రజల్లో తప్పిపోయిన చిన్నపిల్లలను వారి తంల్లిదండ్రుల వద్దకు చేర్చడం కోసం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి క్యాంపు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జాతర ప్రదేశాలలో ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది 24 గంటల పాటు క్యాంపులో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని వైద్యధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతరలో 24 గంటల పాటు విద్యుత్ సౌకర్యం కల్పించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ట్రాన్స్కో సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను ఎంపిక చేయాలని ఆ వివిధ మార్గాలలో వచ్చిన భక్తులు పార్కింగ్ చేసుకునేలా ప్రత్యేక స్థలాలను కేటాయించాలని అధికారులకు సూచించారు. భక్తులు ఆలయం వరకు వాహనాల్లో రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆలయం సమీపంలో గ్రామంలోని ప్రధాన రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పోలీస్, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతర సందర్భంగా ఆలయ సందర్శనకు వచ్చి వీఐపీలకు, సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దర్శన ఏర్పాట్లు చేయాలన్నారు.జాతర విధులకు కేటాయించిన సిబ్బంది అందరూ తమ కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించి జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, డి ఆర్ ఓ పద్మజ రాణి, డిపిఓ సాయిబాబా, SE మిషన్ భగీరథ్ రఘువీర్, ఈ ఈ పి ఆర్, జగదీష్, జహీరాబాద్ ఆర్ డి ఓ రాం రెడ్డి, టెంపుల్ ఈఓ శివరుద్రప్ప, ఆయా మండల ఎంపిడిఓలు, ఎంపీఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఝరాసంగం జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
Published On: February 21, 2025 9:37 pm
