పంచాయతీ ఎన్నికల కోసం సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేపట్టాలి: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ నుండి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. స్టేజ్ వన్, స్టేజ్ టు రిటర్నింగ్ అధికారుల నియామకం శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలు, తిరిగి ఎన్నికల నిర్వహణ తర్వాత ఎన్నికల సామాగ్రి స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారుల ఆదేశించారు. అలాగే బీసీ రిజర్వేషన్ విషయంలో బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరించి చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలపై ఫిర్యాదులను స్వీకరించి, షెడ్యూల్ ప్రకారం తుది జాబితా ప్రకటించాలని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ డీపీవో సాయి బాబా, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment