రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ సిబ్బందినందరిని పర్మినేంట్ చేయాలి.

◆ పర్మినెంట్ చేసేలోపు కనీస వేతనం రూ.26,000/ – నిర్ణయించాలి.

◆ కార్మికులకు 60వ జీఓ ప్రకార వేతనాలు ఇవ్వాలి.

◆ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల స్వామి,

◆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవి కుమార్

సిద్దిపేట సెప్టెంబర్ 20 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట మున్సిపల్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే డైలివేజ్ తదితర పద్దతుల్లో పని చేస్తున్న సిబ్బంది పర్మినెంట్, కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటి ప్రభుత్వ సంక్షేమాలు, కార్మికులకు రక్షణ సదుపాయాలు కల్పించాలని సిఐటియూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పర రవికుమార్ డిమాండ్ చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీలో కార్మికులతో కలిసి మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అనంతరం అందుబాటులో ఉన్న ఆర్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గోపాలస్వామి రవికుమార్ లు మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీలో దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు వీరిలో కొంతమంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్నగా వీరికి ప్రకారం 60జీవో ప్రకారం కేటగిరి వారిగా 16,500/-19500/-21500/- ఇస్తున్నారు కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సింది పోయి దీంతో శ్రమదే ఎప్పుడు ఇందులో కూడా 80 మంది కార్మికులు డైలీ వైజ్ కింద తీసుకొని వారికి కేవలం 12 వేల రూపాయలు నిర్ణయించి వాటిని కూడా అమలు చేయడం కావున వీరందరినీ పర్మినెంట్ చేసి ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ ఈ లోపు కనీసం కుటుంబం బ్రతకడానికి 26 వేల రూపాయలు అందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరారు. పనిచేసే సమయంలో ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారు. రాత్రిపూట పనులు చేసే సమయంలో అతివేగంగా వచ్చే వాహనాల క్రింద పడి అనేక మంది ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అటువంటి వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించడం లేదు. మున్సిపల్ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26,000/లుగా నిర్ణయించాలని, మున్సిపల్ కార్మికులకు 8 గంటలు పని దినాలను అమలు చేయాలని, ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మికులకు రూ.26 లక్షల ఇన్సూరెన్స్ పధకాన్ని అమలు చేయాలి. కావున తమరు జోక్యం చేసుకొని కార్మికులందరి పర్మినేంట్, రూ.26,000/-ల కనీస వేతనాల అమలు, స్థానిక సమస్యల పరిష్కరానికి మార్గం చూపగలరని కోరుతున్నాం. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దొబ్బెట రాజయ్య, గుర్రం నర్సింలు, వినోద, బాల్ నర్సు, మహేష్, ఎల్లయ్య,బాలరాజు, విమల, విజయ, కవిత, స్వరూప, లక్ష్మి, బాలమని హర్సవ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now