మున్సిపల్ కార్మికులు అందర్నీ పర్మినెంట్ చేయాలి

మున్సిపల్ కార్మికులు అందర్నీ పర్మినెంట్ చేయాలి

రెండవ పిఆర్సి లో మున్సిపల్ కార్మికుల బేసిక్ సాలరీ పెంచి అమలు చేయాలి.

కనీస వేతనం 26 వేల రూపాయల వేతనాన్ని వెంటనే అమలు చేయాలి

తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్

సిద్దిపేట జనవరి 6 ప్రశ్న ఆయుధం :

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి, కనీస వేతనం 26 వేల రూపాయలు ఈలోపు చెల్లించాలి అని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎ ఓ రెహమాన్ గారికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ కాంట్రాక్ట్, బెట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు పిఆర్సిలలో నిర్ణయించిన మినిమమ్ బేసిక్-పేని కనీస వేతనంగా చెల్లిస్తున్న అనవాయితీ ఉంది. కానీ గత ప్రభుత్వం జీవో నెం. 60 ప్రకటించినప్పటికీ జీఓలో పేర్కొన్న కేటగిరీల వారీ వేతనాలను మున్సిపల్ కార్మికులకు చెల్లించలేదు. దీంతో 11వ పిఆర్సి నిర్ణయించిన మినిమమ్ బేసిక్ రూ.19,000/-లు, రూ.22,900/-లు, రూ.31,040/- లను కేటగిరీల వారి వేతనాలు మున్సిపల్ కార్మికులకు అమలు కాలేదు, అనేక మున్సిపల్ కార్పొరేషన్లు మరియు మున్సిపాల్టీలలో 8 గంటల పని దినాలను అమలు చేయకుండా కార్మికులతో 12 గంటల పాటు పని చేయిస్తున్నారు. ఇది సరైనది కాదు, పని భారాన్ని తగ్గించాలి. 8 గంటల పనిదినాలను అమలు చేయాలి. డైలీ వేజ్ కార్మికులకు 60 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నుండి పర్మిషన్ లేదని వారికి కేవలం 12 వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం సరికాదని ఇప్పటికైనా వారికి గ్రూపులు ఏర్పాటు చేసి సిడిఎంఏ ఆఫీసు నుండి పర్మిషన్ ఇచ్చి జీతాలు పెంచి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్మికులను పర్మినెంట్ చేసి జీతాలు పెంచకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు గుర్రం నరసింహులు, దొబ్బట రాజయ్య, వినోద, నరసింహులు,సిద్ధులు, యాదయ్య, బాలయ్య, రాజు, రవి, విమల, విజయ, కవిత, నరసవ్వ, బాలవ్వ, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now