త్వరలో జరగనున్న ఎన్నికల ముందే పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలి

*త్వరలో జరగనున్న ఎన్నికల ముందే పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలి*

*డిటిఎఫ్ అధ్యక్షుడు ఆవాల నరహరి*

*జమ్మికుంట ఇల్లందకుంట జులై 3 ప్రశ్న ఆయుధం*

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే పెండింగులో ఉన్న బిల్లులు అన్నింటిని మంజూరు చేయాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఇల్లందకుంట మండల శాఖ గురువారం రోజున ఇల్లందకుంట మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు అనంతరం డీటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల జిపిఎఫ్, సరెండర్ లీవు,టిఎస్ జిఎల్ఐ, ఉద్యోగ విరమణ పొందిన వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొదలగు పెండింగ్ బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జమ్మికుంట జోన్ కన్వీనర్ ఏబూసి శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల విద్యారంగంలో అన్ని స్థాయిల్లో ఖాళీగా ఉన్న జిల్లా విద్యాధికారులు ఉపవిద్యాధికారులు మండల విద్యాధికారుల పోస్టులతో పాటు ఉపాధ్యాయుల పర్యవేక్షక పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని,డైట్,బిఇడి కళాశాలలో లెక్చరర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల అధ్యక్షుడు సార్ల సంపత్ మాట్లాడుతూ డిఏలు ,పిఆర్సీ సుధీర్ఘ కాలం పెండింగ్ లో పెట్టడం సరికాదని ,ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెరుగుతున్న జీవన వ్యయాలకనుగుణంగా ఎప్పటికప్పుడు డిఏలు వేతన సవరణ ఏలాంటి జాప్యం లేకుండా ఇవ్వాలని కోరారు మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్ వేణు మమాట్లాడుతూ వర్క్ అడ్జస్ట్ మెంట్ ఉత్తర్వులను సవరించాలని, ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాలని వర్క్ అడ్జస్ట్ మెంట్ గడువును ఆగస్టు 31 తేదీ వరకు పొడిగించాలని అన్నారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి జోన్ కన్వీనర్ ఏబూసీ శ్రీనివాస్,డిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు సార్ల సంపత్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వేణు రాష్ట్ర కౌన్సిలర్ యం సదానందం జి. ప్రకాష్ సమ్మిరెడ్డి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment