Site icon PRASHNA AYUDHAM

ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

*చెల్పూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్యశిబిరం*

*బిగ్ టీవీ,రెనె హాస్పటల్ ఆధ్వర్యంలో వైద్య సేవలు*

*వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి*

*కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడిదల ప్రణవ్*

*హుజరాబాద్ నవంబర్ 24 ప్రశ్న ఆయుధం::-*

ప్రజల సౌకర్యార్థం ఉపయోగపడే ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ సహకారంతో బిగ్ టీవీ,రెనె హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య,వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పేద ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందని సమాజంలో మంచిని మానవీయకోణం లో చూడడం ముఖ్యమని లాభార్జన లేకుండా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని,ఇలాంటి వైద్య శిబిరాలు హుజురాబాద్ లో మరిన్ని నిర్వహించాలని నిర్వాహుకులను కోరారు నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి కృష్ణారెడ్డి,నేరేళ్ల మహేందర్ గౌడ్,దేశీని కోఠి,పొనగంటి మల్లయ్య,తిప్పారపు సంపత్,పోలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సమ్మెట సంపత్,లంకదాసరి లావణ్య,పుష్పలత,రాధ,అరవింద్,తరుణ్,వెంకటేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version