జమ్మికుంటలో మున్సిపాలిటీలో అన్ని సమస్యలే

*జమ్మికుంట పట్టణంలోని అన్ని సమస్యలే*

*సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలి*

*సిపిఎం నాయకుడు వడ్లూరి కిషోర్*

*జమ్మికుంట నవంబర్ 1 ప్రశ్న ఆయుధం::-*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ప్రజల సమస్యలు పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం నాయకుడు వడ్లూరి కిషోర్ అన్నారు శుక్రవారం రోజున స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో 30 వార్డులు ఉంటే ఏ ఒక్క వార్డు కూడా సమస్యలు లేకుండా లేవని వార్డులలో మురికి కాలువలు, డ్రైనేజ్ సమస్యలు సిమెంట్ రోడ్ల సమస్యలు మంచినీటి సమస్య లతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు పట్టణంలో జనాభా దాదాపు 50 వేల వరకు ఉంటుందని ఇంకో 50 వేల మంది నిత్యం జమ్మికుంట పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నారని వీరికి సౌకర్యానికి అనుగుణంగా స్థానిక బస్టాండ్ ఇరుకుగా ఉండడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ప్రభుత్వం నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుందని వెంటనే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు అలాగే పట్టణంలో పాత మార్కెట్ యార్డ్ లో దాదాపు మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన మటన్ మార్కెట్ నిర్మాణ దశలో ఆగిపోయిందని వెంటనే నిర్మాణం పూర్తిచేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వీణవంక రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వెంటనే వీణవంక రోడ్డు స్థానిక స్మశాన వాటిక వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పట్టణంలో స్మశాన వాటిక కొత్తగా నిర్మించి ప్రజలకు ఇబ్బందులకు కాకుండా చూడాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైల్వే స్టేషన్ నుండి పోస్ట్ ఆఫీస్ దారిలో కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారని అది ఇప్పటివరకు నెరవేరలేదని వెంటనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు పై సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేనియెడల భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు

Join WhatsApp

Join Now