అన్ని సామాజిక వర్గాలకు తమ సంఘంలో సమాన ప్రాతినిధ్యం లభిస్తుంది..

అన్ని సామాజిక వర్గాలకు తమ సంఘంలో సమాన ప్రాతినిధ్యం లభిస్తుంది..

-పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 28:

అన్ని సామాజిక వర్గాలకు తమ సంఘంలో సమాన ప్రాతినిధ్యం లభిస్తుందని పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోచయ్య పదవి విరమణ సన్మాన సభకు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా సంఘం బలోపేతంలో ప్రధానోపాధ్యాయుడు పోచయ్య చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. వచ్చే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ యూనియన్ బలపరిచిన ఇద్దరు వ్యక్తులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి తమ సంఘం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు పోచయ్య దంపతులను పిఆర్టియు నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా పిఆర్టియు అధ్యక్షుడు కుశాల్, ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, ప్రతినిధులు ఆనంద్ రావు, గోవర్ధన్, బాపురెడ్డి, బస్వంత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment