నన్ను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయం: రఘురామ

నన్ను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయం: రఘురామ

అమరావతి: సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ అరెస్టును ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు (Raghu Rama Krishna Raju) స్వాగతించారు. కస్టడీలో తనను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు..

సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ విదేశాలకు పారిపోకుండా లుకౌట్‌ నోటీసులు ఇవ్వాలన్నారు.

రఘురామకృష్ణ రాజును కస్టడీలో వేధించిన కేసులో విజయ్‌పాల్‌ను మంగళవారం అరెస్టు చేహిసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. మంగళవారం రాత్రి నుంచి విజయ్‌పాల్‌ (Vijay Paul) ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. ఆయన్ను నేడు గుంటూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నగరపాలెం పోలీసు స్టేషన్‌కు ఆయన్ను తీసుకురానున్నారు. గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment