కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి

కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి

 

కనీస వేతనం రూ 26,000 లు చేయాలి.

 

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, 

 

అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.

 

సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సందబోయిన ఎల్లయ్య, కాముని గోపాలస్వామి 

 

సిద్దిపేట సెప్టెంబర్ 28 ప్రశ్న ఆయుధం :

 

ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, మున్సిపల్, గ్రామపంచాయతీ, ప్రభుత్వ కార్యాలయంలొ, యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26 వేలు నిర్ణయించాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు సంద బోయిన ఎల్లయ్య, కాముని గోపాలస్వామి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున సిఐటియు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కార్మికుల కనీస వేతనాలు జీవోలు సవరించాలని చెబుతున్న 2005 సంవత్సరం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి తెలంగాణ అనంతరం వేతనాలు జీవోలు సవరించలేదు దీంతో కార్మికుల యొక్క నిజ వేతన స్థాయి పడిపోయింది కార్మికుల యొక్క అవసరాలు తీరడం లేదు పెట్రోలు డీజిల్ నిత్యవసర సరుకులు ఇంటి అద్దెలు విద్య వైద్యం ఖర్చులు అనేక రెట్లు పెరిగిన కార్మికుల యొక్క వేతనాలు మాత్రం పెరగడం లేదు 15 వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్ణయం ప్రకారం వేతనాలు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట మరియు గజ్వేల్ వర్గల్ ములుగు మర్కుక్ మండలాల్లో ఉన్న పరిశ్రమలు కనీస వేతనాలు అమలు చేయడం లేదు.కార్మికులందరికీ ఈఎస్ఐ,పిఎఫ్ బోనసు బ్యాంకు ద్వారా వేతనాలు యూనిఫామ్,చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయడం లేదు. అనేక పరిశ్రమల లో 12 గంటల పని విధానం అమలు చేయడం జరుగుతుంది. ఓ టి డబ్బులు వేతనం ఇవ్వడం లేదు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించడం లేదు. మహిళా కమిటీలు ఏర్పాటు చేయడం లేదు. అనేక పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. గ్లౌజులు ,మాస్కులు , సేఫ్టీ పరికరాలు షూస్ ఇవ్వడం లేదు.అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు సంక్షేమ మరియు సౌకర్యాలు కల్పించడం లేదు. జిల్లాలో సుమారు లక్ష మంది ఈఎస్ఐ బీమా సభ్యులు ఉన్న ఈఎస్ఐ స్థానిక కార్యాలయం మరియు డిస్పెన్సరీ లేవు జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. సిద్దిపేట మున్సిపల్ లో80 మంది కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు కావున నాన్ పర్మినెంట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని కార్మిక సంక్షేమ చర్యలకు చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ జిల్లా కమిటీ సభ్యుడు అమ్ముల బాల్ నర్సయ్య,నాయకులు గుర్రం నరసింహులు, దొబ్బెట రాజయ్య, వినోద, రాజయ్య, కవిత, నరసింహులు,సురేష్, యాదగిరి, రాములు, మల్లేశం నర్సింహులు, నాగరాజు, నగేష్ కనుకవ్వ, మహాలక్ష్మి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now