ఆదివాసీలకు అన్యాయం చేశారని, న్యూ డెమోక్రసీనాయకుల మీద ఆరోపణ 

IMG 20240818 WA2680

 

ఆదివాసి భవనం నిర్మించేందుకు కేటాయించిన స్థలంలో డెమోక్రసీ సిపిఐ నాయకులు ఆక్రమిస్తున్నారని ఆదివాసీ నాయకులు ఆరోపిస్తున్నారు. గత 20 ఏళ్లగా దమ్మపేట మండలం తాసిల్దార్ కార్యాలయం సమీపంలో ఆదివాసీలు గతంలో ఈ స్థలంలో ఆదివాసి జేఏసీ కమ్యూనిటీ హాల్ నిర్మించుటకు ప్రయత్నాలు చేసారు. ఈ స్థలం కొరకు కొత్తగా విధుల్లోకి చేరిన జిల్లా కలెక్టర్, కు ఐటీడీఏ పి ఓ, కు ఆర్డిఓ, ఎమ్మార్వో, గత ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇచ్చి ఉన్నాము.అయితే భవనం నిర్మించేందుకు కొంతమేరకు డబ్బు డొనేషన్ రూపంలో రావలసి ఉంది . ఈ ఏడాదిలో పనులు మొదలు పెట్టుకునే సమయం ఆలస్యం అవ్వటం వలన కొంతమంది ఈ స్థలంపై కన్నేశారు. న్యూ డెమోక్రసీ పార్టీలో కొందరు నాయకులు మా పార్టీ కార్యాలయం ఇక్కడే నిర్మిస్తామని దౌర్జన్యంతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది గమనించిన ఆదివాసీ నాయకులు వారిని ఈ స్థలంలోకి రావడానికి హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. దానికి బదులుగా మరి కొంతమంది ఆదివాసీలను వారి మాయ మాటలతో మాపై దౌర్జన్యానికి వచ్చేలా చేశారు. మాలో మాకు గొడవలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పేరు చెప్పి కార్యాలయాలు ఎన్ని నిర్మిస్తారు. మండల పరిధిలో ఇప్పటకే మూడు కార్యాలయాలు ఉన్నాయి. అయినా అదనంగా మరో ఆఫీస్ నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీల పై దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అమాయక ఆదివాసీలను రెచ్చగొట్టి మాపై దౌర్జన్యానికి దిగుతున్నారు. మాపై మాకే గొడవలు పెట్టి పబ్బం గడుపుకుందామని చూస్తున్నారు. ఇప్పటికైనా ఆదివాసీలు ఒక్క తాటి మీదకు చేరి ఆదివాసి కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు ప్రయత్నం చేద్దాం ఇటువంటి మోస పూర్వక మాటల చెప్పే నాయకులను నమ్మొద్దు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్న నాయకుల పై తగు చర్యలు తీసుకుంటామని జేఏసీ ఆదివాసీ నాయకులు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now