వినాయక నిమజ్జనం కోసం పకడ్బందీ ఏర్పాట్లు
నిమజ్జనం ఇన్సిడెంట్ ఫ్రీ ఈవెంట్గా నిర్వహించాలి : కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 29
వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. శుక్రవారం శామీర్‌పేట్ చెరువులో నిమజ్జన ఏర్పాట్లను అడిషనల్ డీసీపీ పురుషోత్తంతో కలిసి ఆమె స్వయంగా పరిశీలించారు.
అన్ని ఏర్పాట్లు సిద్ధం
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి విభాగం నిర్మిస్తున్న రహదారి వినాయక వాహనాల రాకపోకలకు అనుకూలంగా ఉండేలా పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. చెరువులో నీటి మట్టం పెరిగినందున, భక్తుల భద్రత కోసం బ్యారికేడింగ్ పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం జరిగే రెండు పాయింట్ల వద్ద క్రేన్లు, లైటింగ్, శానిటేషన్, వైద్య సదుపాయాలు, తాగునీరు, టాయిలెట్లు వంటి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
ఈ ఏడాది గతంలో కంటే ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం కానున్నందున, పోలీసులు, ట్రాఫిక్, మత్స్య, అగ్నిమాపక శాఖలు 24 గంటలు విధుల్లో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి మున్సిపాలిటీ అధికారులు చెత్త తొలగింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, శామీర్‌పేట్ ఎంఆర్ఓ యాదగిరి రెడ్డి, ఆర్ అండ్ బి అధికారి శ్రీనివాస్ మూర్తి, శామీర్‌పేట్ సీఐ శ్రీనాథ్, ఎస్ఐ శశివర్థన్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.