అభివృద్ధికి నిధులు కేటాయించండి
జలమండలి ఎండికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భారతీ నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్లో పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు 13 కోట్ల 20 లక్షల రూపాయలు నిధులు కేటాయించాలని ఆ శాఖ ఎండి అశోక్ రెడ్డిని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డివిజన్లో పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. బల్దియ పరిధిలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలతో పాటు, పాత కాలనీలలో అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రణాళికల సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయించాలని కోరారు. వీటితోపాటు గతంలో జలమండలికి కేటాయించిన ఆర్ హెచ్ సి ప్రాంతంలో ఆసుపత్రి సేవలు లేనందున స్థానిక అవసరాల కోసం జిహెచ్ఎంసి కి కేటాయించాలని కోరారు. ఎందుకు సానుకూలంగా స్పందించిన ఎండి అశోక్ రెడ్డి త్వరలోనే నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.