Site icon PRASHNA AYUDHAM

నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్డుకు అనుమతి

IMG 20250722 WA0333

నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్డుకు అనుమతి

 

— నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్ కి అనుమతి ఇచ్చిన కామారెడ్డి మండల విద్యా శాఖ అధికారిని సస్పెండ్ చేయాలి.

 

– అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మండల విద్యాశాఖ అధికారి

 

– ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతూ ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్న ఎంఇఓ

 

– ఎంఇఓ ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలి.

 

– భారతీయ విద్యార్థి మోర్చ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 22

 

కామారెడ్డి మండల విద్యా శాఖ అధికారి ఎల్లయ్య ని వెంటనే సస్పెండ్ చేయాలని భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆర్బాస్ ఖాన్ ,బుల్లెట్ చక్రవర్తి మాట్లాడుతూ నిబంధనలు విరుద్ధంగా తను మాచారెడ్డి ఇంచార్జ్ గా ఉన్నపుడు రేకుల షెడ్ కి కనీస మౌలిక సదుపాయాల లేకుండానే పాఠశాల ను సందర్శించకుండా ప్రవేటు పాఠశాలకు అనుమతి ఇవ్వడం జరిగింది.దీని పైన జిల్లా విద్యా శాఖ అధికారికి పిర్యాదు చేయడం తో వెంటనే పాఠశాల పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అన్నారు. ప్రవేట్ పాఠశాల దగ్గర డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను వారు కోరిన పాఠశాలలో పోస్టింగ్ కావాలంటే వాళ్ళు ఇచ్చే మాములుతో డిప్టేషన్ వేయడం జరిగింది. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా వారికి వత్తస్సు పలుకుతున్నారు. గర్గుల్ పాఠశాలలో టీచర్ల కావాలని పిల్లలను మానసికంగా ఒత్తిడి గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు ఎంఈఓ కు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఈఓ ఆదేశాలు జారీ చేసిన విచారణ చేపట్టకుండానే తప్పుడు రిపోర్ట్ రాసి పంపుతున్నారు. ఎంఈఓపై గతంలోనే ఫిర్యాదు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోలేకపోయారు. ఇప్పుడైనా ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎంఈఓ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అన్నారు. లేనిపక్షంలో అన్ని ఆధారాలతో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం తో పాటు విద్యాశాఖ కమిషనర్ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్, వంశీ,శ్యామ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version