ఉషా ముల్లపూడి కమన్ వద్ద
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి
వేడుకలు
ప్రశ్న ఆయుధం జులై04: కూకట్‌పల్లి ప్రతినిధి
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని కూకట్ పల్లీ ఉషా ముల్లపూడి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు తో కలిసి హాజరయ్యారు.
వారు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ –
“భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు పాత్ర మరువలేనిది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యువ నాయకుడిగా ఆయన జీవిత చరిత్ర ప్రతి భారత యువతకి ప్రేరణగా నిలవాలి. అల్లూరి త్యాగాల్ని స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు ఆయన ఆత్మీయ స్ఫూర్తిని చేరవేయాలి,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లీ అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాంజాల పద్మయ, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు,మూసాపేట్ డివిజన్ కార్పొరేటర్ కోడిచేర్ల మహేందర్, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు, యువత, కమిటీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.