శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలి.
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ మైదానంలో వాలీబాల్ కోర్ట్ ను ప్రారంబించినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖాకీ బట్టలతో నిత్యం పని ఒత్తిడిలో పరుగులు తీసే పోలీసులు ఆ పనులు పక్కన పెట్టి ఆటలు ఆడేందుకు మైదానంలో క్రీడలలో పాల్గొనాలని పోలీసు సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు.
పోలీసు పాత్ర అనేది అత్యంత కీలకమని, పోలీసు ఉద్యోగం అనేది వత్తిడి,శ్రమతో కూడినదని, వత్తిడిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఇలాంటి క్రీడా కార్యక్రమాలు బాగా దోహదం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ శైలేందర్,ఏ. ఆర్ ఎస్ ఐ లు నరేష్,మహిపాల్ పాల్గొన్నారు.