కుడా ఏర్పాటు ఎందుకోసం…??

(కుడా ఏర్పాటు ఎందుకోసం…??

ప్రజలపై భారీగా పెరగనున్న పన్నుల భారం.. !

ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కడమేనా…??

మీడియా సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

*కొత్తగూడెం*: కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఏర్పాటు ఎవరి కోసమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఆదివారం కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాతవి 15 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయని తెలిపారు.ఇటీవల కొత్తగా 13 అథారిటీలను ఏర్పాటు చేయగా కొత్తగూడెం(కుడా) మినహా మిగతా అన్ని కూడా 100 కు పైగా గ్రామాలు ఉన్నాయని కుడలో మాత్రమే కేవలం ఒకే ఒక్క గ్రామాన్ని కలిపారని దీని వల్ల అభివృది ఏవిధంగా సాధ్యమవుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఖమ్మం(సుడా)లో 325 గ్రామాలు,సూర్యాపేటలో 264 గ్రామాలు,అయిదు మున్సిపాలిటీలు ఉండగా కొత్తగూడెంలో మాత్రం కేవలం ఒకే ఒక్క గ్రామాన్ని కలిపారని దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటని ప్రశ్నించారు.గతంలో బిల్డింగ్ ల అనుమతులకు బెటర్మెంట్ చార్జెస్ మున్సిపాలిటీ వారు తీసుకునే వారని,ఇప్పుడు అవి కుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు తీసుకోవడం మూలంగా మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతుందన్నారు.ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై భారీగా పన్నుల భారం పడుతుందని పేర్కొన్నారు.అసలు కుడా అనేది ఏ ప్రాతిపదికన తీసుకువచ్చారని 23 సంవత్సరాలుగా పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగక అభివృద్ది కుంటుపడిందని,ఏజన్సీ సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏజన్సీ చట్టాలను తుంగలో తొక్కి హడావుడి చేయడ మేంటని నిలదీశారు.కుడా వల్ల గ్రామీణ ప్రాంతాల వారు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని,ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,కొత్తగూడెం పట్టణ,లక్ష్మీదేవిపల్లి,సుజాతనగర్ మండలాల అధ్యక్షులు,వెంకట్,దిలీప్ గుడివాడ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment