గుర్రాలగొందిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

IMG 20241009 213052

సంగారెడ్డి/సిద్ధిపేట, అక్టోబరు 9(ప్రశ్న ఆయుధం న్యూస్): సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్ మండలం గుర్రాలగొందిలో ఎల్లమ్మ ఆలయం వద్ద ఫంక్షన్ హాల్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. 1986-87 సంవత్సరానికి సంబంధించిన గుర్రాలగొందిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు కలుసుకొని ఒకరికొకరు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కొందరు ఉద్యోగులుగా స్థిరపడగా.. మరికొందరు వ్యాపారస్తులుగా స్థిరపడ్డామని తెలిపారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని సంతోషం వ్యక్తం చేశారు. అప్పటి ఉపాధ్యాయులు చంద్రారెడ్డి, యాదగిరి, శ్రీధర్, వార్డెన్ మహంకాళీలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కండక్టర్ శ్రీనివాస్, ఇంజనీర్ రాములు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు పొందినందున శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులతో పాటు పూర్వ విద్యార్థులు కలిసి భోజనం చేశారు. పూర్వ విద్యార్థులు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో సందడి వాతావరణం నెలకొన్నది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, రాములు, నర్సయ్య, రాజయ్య, ఆంజనేయులు, వేణుగోపాల్, పిట్ల రాజయ్య, రవి మల్లారెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now