కాలనీలా సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి

కాలనీలా సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

ప్రశ్న ఆయుధం నవంబర్ 30: కుత్బుల్లాపూర్ ప్రతినిధి 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ డి.పోచంపల్లి సురక్ష గ్రీన్ మీడోస్ కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఈరోజు గండిమైసమ్మలోని పురపాలక కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తా అని తెలిపారు. కాలనీలో ఏ సమస్యలున్నా తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ యాదవ్, కాలనీ నూతన ప్రెసిడెంట్ వేణు గౌడ్ వైస్ ప్రెసిడెంట్లు సుధాకర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీరాములు, జాయింట్ సెక్రెటరీ మైసయ్య గౌడ్, ట్రెజరర్ సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అమర్నాథ్, అడిషనల్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ నాయుడు, అడ్వైజర్ మల్యాద్రి రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment