నవంబరు 01 నుండి 09వరకు అమరవీరుల వారోత్సవాలను గ్రామ గ్రామాన నిర్వహించండి

అమరవీరుల
Headline:
సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పిలుపు – నవంబర్ 1 నుండి 9 వరకు ఖమ్మం జిల్లాలో అమరవీరుల వారోత్సవాలు జరపండి

సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అరుణోదయ నాగన్న

అమరవీరుల వారోత్సవాలు నవంబరు 1 నుండి 9వరకు ఖమ్మం డివిజన్ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో నిర్వహించాలని సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అరుణోదయ నాగన్న, జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. ఖమ్మం లెనిన్ నగర్ సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఖమ్మం డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటంలో, ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో మెరికలాంటి పోరాట యోధులు చంపివేయబడ్డారన్నారు. భారత విప్లవోద్యమంలో ప్రతిఘటన పోరాట పంథా వెలుగులో పనిచేస్తూ చండ్రపుల్లారెడ్డి నవంబర్ 9న నేలకొరిగారన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటంలో అసువులు బాసిన పోరాట యోధులను స్మరించుకుంటూ నవంబరు 1 నుండి 9 వరకు అమరవీరుల వారోత్సవాలు జరుపుతున్నామన్నారు. ఈ అమరవీరుల వారోత్సవాలు డివిజన్ వ్యాప్తంగా ప్రతి వాడ వాడన గ్రామాల్లో నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ఈ దోపిడీ వ్యవస్థ రద్దు కావాలని సమ సమాజం కోసం నిర్మాణం కావాలని ఉద్యమించి ఎంతోమంది అమరులయ్యాన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాయల రవన్న, దొరన్న, బాటన్న, కోటన్న, ఎల్లన్న, లింగన్న, ముక్తార్ పాషన్న, పోట్లపల్లి శ్రీశైలం తదితరులు ఈసమాజంలో జరుగుతున్న అసమానతలు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి తమ అమూల్యమైన జీవితాలను, ప్రాణాలను అర్పించారన్నారు. వారు చూపిన బాటలో దోపిడీ, పీడన, అణిచివేత లేని, అసమానతలు లేని సమాజం కోసం ఈ ప్రాంతంలో ఎంతో మంది ఉద్యమించి అమరులయారని అన్నారు. వారి ఆశయాల ఎర్రజెండాను సమున్నతంగా ఎత్తిపటి ఈ వ్యవస్థ మార్పుకై పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తూ అమరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమిస్తామని స్మరిస్తూ సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబరు 1 నుండి 9 వరకు గ్రామ గ్రామాన అమరవీరుల వారోత్సవాలు జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ, నాయకులు వై ప్రకాష్, వి వి రావు, పరకాల లక్ష్మక్క, పి మోహనరావు, షేక్ సుభహాన్, వై జానకి, షేక్ ఖాసీం ఖాన్, కిషన్, మురళి, సంగక్క PDSU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి మస్తాన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now