భూంపల్లి గ్రామంలో ఘనంగా అంబరీశ్వర స్వామి ఉత్సవాలు
ప్రశ్న ఆయుధం

జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో అంబరీశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు పూజా కార్యక్రమం నిర్వహించారు తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఆలయంగా అంబరీశ్వర స్వామిని ఆలయం నిర్మించడంలో దాతల సహకారంతో గ్రానైట్ రాయితో నిర్మించిన ఆలయం వందేళ్లుగా చెక్కుచెదరగా ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ కండక్టర్ రాజిరెడ్డి తెలిపారు అంబరీశ్వర ఆలయం వద్ద తండోపతండాలుగా ప్రజలు వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు చక్కటి వాతావరణంతో ఆలయ వార్షికోత్సవాలు మూడో రోజు ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు జంగం శివకుమార్ ప్రవీణ్ గ్రామ పురోహితులు రమేష్ జోషి మరియు వేద పండితులు శ్యాంప్రసాద్ శర్మ రాఘవేంద్ర శర్మతో పాటు ఇతర వేద పండితులు ఆధ్వర్యంలో వివిధ ఆత్మీయ కార్యక్రమాలు చేశారు వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు సోమవారం రోజు విగ్రహ ప్రతిష్టాప గజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాలు మరియు మంగళవారం రోజున సాయంత్రం ఐదు గంటలకు అగ్ని గుండాల కార్యక్రమం ఉంటుందని భక్తులు పేర్కొన్నారు తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఆలయంలో ఒకటి అంబరీశ్వర స్వామి ఆలయం భూంపల్లి లో వెలిసింది దాతల సహకారంతో నిర్మాణం పూర్తి చేసుకొని ఐదు రోజులపాటు అంబరీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ కండక్టర్ రాజిరెడ్డి గ్రామస్తులు తెలిపారు ఇంకా రెండు రోజులపాటు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ కండక్టర్ రాజిరెడ్డి తెలిపారు భక్తులు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు
Post Views: 28