*బీజేపీలోకి అంబటి రాయుడు?*
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విశాఖలో జరిగిన ఏబీవీపీ మహాసభలో ఆయన కాషాయం పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యానించారు. “కొన్ని పార్టీలు కుటుంబాల చుట్టూ తిరుగుతాయి. మరికొన్ని పార్టీలు కార్పొరేట్ సంస్థల చుట్టూ తిరుగుతాయి. కానీ దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ ఒక్కటే”అని తెలిపారు. కాగా, అంబటి రాయుడు వైసీపీని వీడి జనసేనలో చేరిన విషయం తెలిసిందే.