అంబేద్కర్ అభయ హస్తం పథకం అమలు చేయాలి
డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు
అంబేద్కర్ అభయ హస్తం పతకాన్ని అమలు చేయాలని డిపిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు అన్నారు. గజ్వేల్ విలేకరుల సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు హామీలు గానే మిగిలిపోయాయి అని అన్నారు. ఈ సందర్భంగా బ్యాగారి వేణు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి ఆర్ధిక మద్దతు పధకాలకు బ్యాంకు లింకెజి తోలగించాలని,2020-21 ఆర్ధిక సంవత్సరం పెండింగ్ రుణాలకు సబ్సిడీ ని విడుదల చేయాలన్నారు. క్రాప్ లోన్ పేరుతో నెల సరిగా తీసుకుంటు పింఛన్లు క్రాప్ లోన్ పేరుతో అకౌంట్ ఓల్డ్ లో పెట్టడం వల్ల పింఛన్లు తీసుకుందానికి ప్రజలు ఇబ్బందికి గురవుతుందన్నారు. క్రాప్ లోన్లకు పింఛన్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు.ఆగస్టు లోపు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలన్నాడు.ఇప్పుడు చేసిన రుణమాఫీ మళ్లీ రైతులకు యధావిధిగా మంజూరు చేయాలని అన్నాడు. బ్యాంకు ల చుట్టూ తిరగకుండా ఇవ్వాలని కోరాడు. అప్పట్ల చూసావంటే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాం లోనే విద్యార్థులపై లాటి చార్జీలు చూసే పరిస్థితి ఉందన్నాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఇచ్చిన 6 గ్యారంటీ లను అమలు చేసి ఇచ్చిన హామీలను నిరుపేద కుటుంబాలకు అందించే విధంగా ఇవ్వాలని దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు.
అంబేద్కర్ అభయ హస్తం అమలు చేయాలి
Published On: August 11, 2024 6:19 pm
