Site icon PRASHNA AYUDHAM

అంబేద్కర్ భవనం  ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ పునఃప్రారంభించం

IMG 20240925 WA0045

అంబేద్కర్ భవనం  ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ పునఃప్రారంభించండి గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి టిడిపి రాష్ట్ర నాయకులు కొర్రపాటి సురేష్ వినతి.బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కె ఎస్ నాగలక్ష్మి గారిని టిడిపి రాష్ట్ర నాయకులు కొర్రపాటి సురేష్ పుష్పగుచ్చం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు.కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రిగా ఉన్న సమయంలో ఏసి కళాశాల ఎదురుగా ఉన్న అంబేడ్కర్ భవనం నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు కేటాయించారని టిడిపి హయాంలో సగం పూర్తి చేసి నక్కా ఆనందబాబు గారు మంత్రిగా మరో 6 కోట్లు కేటాయుస్తే గత ప్రభుత్వం ఆ నిధులను వెనక్కి తీసుకోవడంతో నిర్మాణం ఆగిపోయిందని గత 5 ఏళ్లలో 10 కోట్లు కేటాయించామని మాటలతో కాలయాపన చేసి గుంప మట్టి కూడా వేయలేదని అంబేడ్కర్ భవన్ నిర్మాణం చేపట్టి దళితులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లాలో ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ కూడా పునఃప్రారంభం చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు మాట్లాడుతూ అంబేడ్కర్ భవన్ నిర్మాణానికి ఎస్టిమేషన్ చేయిస్తామని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ కూడా పునఃప్రారంభం చేసి ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు ధీటుగా శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు..

Exit mobile version