*అంబేద్కర్ గొప్ప మహానీయుడు*
*అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు వెళ్లాలి*
*బిజెపి ఇల్లందకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి*
*
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం రోజున బిజెపి ఆధ్వర్యంలో ఇల్లందకుంట మండల కేంద్రంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ బహుజన కుటుంబంలో జన్మించిన బిఆర్ అంబేద్కర్ తాను చదువుకునే రోజుల్లో కుల వివక్ష, అంటరానితనం అనే భూతాల కారణంగా అనేక రకాల ఇబ్బందులు గురయ్యాడని, కానీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా ఉన్నత చదువు చదువుకొని ఈ దేశం నుండి కులవివక్ష, అంటరానితనం అనే భూతాలను తరిమి వేయాలనే సంకల్పంతో ఉన్నత విద్యను అభ్యసించి, వివక్ష చూపించిన వారి చేతనే మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని ప్రశంసించారు రాజ్యాంగ పీటిక నూ బీజేపీ నాయకులతో భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం ఆరాధనల స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.అని ప్రమాణం చేయించడం జరిగిందన్నారు మండల ఉపాధ్యక్షులు అబ్బిడి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు, ఏప్రిల్ 14ను సమానత్వ దినంగా జరుపుకుంటారు,అంబేద్కర్ 1907 లో మెట్రిక్యూలేషన్ తర్వాత న్యూయార్క్ కొలంబియా విశ్వావిద్యాలయంలో మాస్టర్స్ అఫ్ ఆర్ట్స్ లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో డాక్టరెట్ పూర్తి చేశారు, ఈయన విద్యావేత్త, రాజకీయవేత్త, రాజ్యాంగ నిర్మాణకర్త, ఈయన ఆశయాలు చాలా గొప్పవి ఆశయాసాధనకు ఇంతక ముందు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాసాధనకు కృషి చేయకుండా ఎలక్షన్స్ వచ్చినపుడు మాత్రమే ప్రజలను మభ్యపెట్టి దాదాపు 60సంవత్సరాలు ప్రభుత్వం లోకి వచ్చి రాజ్యాంగాన్ని సుమారు 125 సవరణలు చేయడంజరిగింది కానీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం ను మారుస్తుందని బురదజల్లే కార్యక్రమాలు చేయడం హేమమైన చర్య అని హెద్దెవా చేశారు, రాజ్యాంగ పరిరక్షణ బీజేపీ ప్రభుత్వం తోటే సాధ్యమని తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో రాజ్యాంగ పరిరక్షణ గురించి తప్పుడు ప్రచారం చేస్తుందని, కానీ తెలంగాణ ప్రజలు, ఓటర్స్ మేధావులని వారికి అన్ని తెలుసనీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుత్తికొండ రాంబాబు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కంకణాల రవీందర్ రెడ్డి, ఆరెల్లి శ్రీనివాస్, అబ్బిడి తిరుపతి రెడ్డి, బొమ్మడి శ్రీధర్ రెడ్డి,ఎండీ షఫీ, గురుకుంట్ల సాంబాన్న,రావుల విజయ్ బాబు, కంధాల రాజేందర్, మురహరి గోపాల్, వలసాని సునీల్,ఉప్పు దుర్గయ్య, కొక్కుల దేవేందర్, చదువు సాయిరెడ్డి, చిట్ల శ్రీనివాస్,గురుకుంట్ల సంజీవ్,ఏడ్ల రమేష్ రెడ్డి,రామ్ శివ,మాదాసు మొగిలి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు