అన్ని వర్గాలకు ఆదర్శప్రాయుడు అంబేద్కర్
–ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పున్న రాజేశ్వర్ ముదిరాజ్
-జిల్లా అధ్యక్షుడు గజ్జె బిక్షపతి ముదిరాజ్
ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 6, కామారెడ్డి టౌన్ :
భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శప్రాయుడని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్న రాజేశ్వర్ ముదిరాజ్, జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గజ్జల బిక్షపతి ముదిరాజ్ లు పేర్కొన్నారు. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హక్కులతో పాటు ప్రజలకు బాధ్యతలు ఇచ్చిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అతిపెద్ద రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘం నాయకులు, గరిగంటి లక్ష్మీనారాయణ, సుశీల్, కనకంటి రాజు, తదితరులు పాల్గొన్నారు.