విశ్వవిఖ్యాత హాజీఅలీ దర్గా వారిచే అంబేడ్కర్ జయంతి

*విశ్వవిఖ్యాత హాజీఅలీ దర్గా వారిచే అంబేడ్కర్ జయంతి*

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 20: ముస్లింల విశ్వవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన ముంబైలోని మహీం మక్దూమ్ బాబాదర్గా, హాజీఅలీ దర్గా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా శనివారం మహీంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతి నిమిత్తంగా సర్వధర్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో మార్గదర్శకులుగా బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు భీంరావు అంబేడ్కర్ హజారై మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్ని మతాలకు ఆర్టికల్ 25, 26, 27 ద్వారా సమాన హక్కులు కల్పించిందన్నారు. అయితే రాజ్యాంగాన్ని సరిగా అమలు చేస్తే భారత దేశం సూపర్ పవర్ అయి తీరుతుందని ఆశాభావం వ్యక్తపర్చారు. సీనియర్ జర్నలిస్ట్ సునీల్ కోభ్రగడే మాట్లాడుతూ దేశాన్ని “నేషన్” గా తీర్చిదిద్దడానికి కృషి చేసిన ఏకైక మహనీయులు బి.ఆర్ అంబేడ్కర్ గారేనన్న చారిత్రాత్మక ఘటనలతో తేల్చి చెప్పారు. సమ్మేళన ఆరంభంలో “రాజ్యాంగ పిఠిక” సమష్టిగా చదివారు. ఇందులో డాక్టర్ సయ్యద్ సాబీర్, సిక్కు మతగురువు అమర్ సింగ్ ఖాల్స, బౌద్ధ గురువు బంతే ప్రజ్ఞాసూర్య, బహుజన కవయిత్రి శారద నవలే, పాండురంగ సాల్వే, మిలింద్ ఊకె హాజరైయ్యారు. సభకు దర్గా ట్రస్ట్ ప్రముఖులు సుహెల్ ఖండ్వాని అధ్యక్షత వహించగా, శిరీష్ రాంటెకె వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చివర్లో కర్ణాటక వారు తయారు చేసిన ఆంగ్లంలోని “రాజ్యాంగ ప్రియంబుల్” అద్భుతమైన ఆడియోను వినిపించి సభను ముగించారు.

Join WhatsApp

Join Now