కీసర, తూంకుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

*కీసర, తూంకుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు*

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 14

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు కీసర మరియు తూంకుంట మున్సిపల్ పరిధిలో ఘనంగా నిర్వహించారు.

కీసర మండల కేంద్రంలో జరిగిన జయంతి కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ , మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ , మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్, తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి , కీసర మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోల కృష్ణ యాదవ్ మరియు పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. వారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన అందరికీ ఆదర్శనీయులని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమసమాజ నిర్మాణం, స్వేచ్ఛ మరియు సమానత్వం పెంపొందించడానికి అంబేద్కర్ సిద్ధాంతాలు ఎంతో ఉపయోగపడతాయని వారు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, భారత తొలి న్యాయశాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ప్రజా ప్రభుత్వం ఆయన ఆశయాలను కొనసాగిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

అదేవిధంగా, తూంకుంట మున్సిపల్ పరిధిలోని తూంకుంట, దేవరయంజాల్ మరియు గ్రంథాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలకు పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు మరియు అనధికారులు హాజరయ్యారు. వారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమాలలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్, తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, శామీర్‌పేట్ మండల మాజీ ఎంపీపీ నాలిక యాదగిరి, జాతీయ కళా మండలి అధ్యక్షులు యన్ వై అశోక్, రాష్ట్ర దళిత సమైక్య అధ్యక్షులు బి.ఎన్. రామ్మోహన్, జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు బంగరగళ్ళ శంకర్, మాజీ కౌన్సిలర్లు సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, బోల్ల బోయిన రాజు యాదవ్, మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పట్నం నర్సింహ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు చీరాల యాదగిరి, రామాలయం మాజీ ధర్మకర్తలు పట్నం నర్సింహ రెడ్డి, బక్కొల శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, గుంతల కృష్ణారెడ్డి, బక్కొల నర్సింగ్ రావు, నూనె ముంతల రవీందర్ గౌడ్, బెంబడి జంగారెడ్డి, టీఆర్ రవీందర్ గౌడ్, రంగప్ప నాగరాజ్ గౌడ్, మన్నే బిక్షపతి, గట్టు ప్రదీప్ కుమార్, శ్రీకాంత్, కత్తి వెంకటేశ్, వజ్జల శేశాంత్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తి రమేష్, యూత్ నాయకులు కత్తి మహేష్, చింతల మణిదీప్ రెడ్డి, కత్తి భరత్, మున్సిపల్ కార్యాలయం నుండి రేణుక, భార్గవి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment