నాగారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

*నాగారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 14

IMG 20250414 WA3745

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నాగారం మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు యాదవ్ అధ్యక్షతన రాంపల్లి చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పీఠికను అందరితో చదివించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ ఆర్థికవేత్తగా, న్యాయవేత్తగా, రాజకీయనాయకుడిగా మరియు భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఐక్యతతో మెలగాలని, మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గత 60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ తీసుకుని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఉండే కేంద్ర హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఆయన అన్నారు.

అంతేకాకుండా, అంబేద్కర్ కి సంబంధించిన ఐదు పవిత్ర క్షేత్రాలను “పంచతీర్థ”గా భారత ప్రభుత్వం ప్రకటించిందని చంద్రారెడ్డి వివరించారు. ఆ ఐదు తీర్థాలు: మధ్యప్రదేశ్ (జన్మస్థలం), లండన్ (విద్యనభ్యసించిన స్థలం), నాగ్‌పూర్ (దీక్షాభూమి), ఢిల్లీ (మహాపరినిర్వాణ స్థలం), మరియు ముంబై (చైత్యభూమి). ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర క్షేత్రాలను దర్శించి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు మునిగంటి సురేష్, జిల్లా కార్యదర్శి గణపురం శ్యామ్ సుందర్ శర్మ, మాజీ ఎంపీటీసీ తరిగొప్పుల బలరాం, మాజీ కౌన్సిలర్లు బుద్ధవరం లక్ష్మి, బిజ్జా శ్రీనివాస్ గౌడ్, రామారం మహేందర్ గౌడ్, మాజీ అధ్యక్షులు బుద్దవరం వేణుగోపాల్, నక్క కిషోర్ గౌడ్, మారేష్, భువనేశ్వరి, మామిడి జంగారెడ్డి, రామక్కపేట రవీందర్ రెడ్డి, సూర్యశేఖర్ రెడ్డి, వోల్లల శ్రీనివాస్ గౌడ్, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, కర్ర వెంకటేశ్వరరావు, జూపల్లి నరేష్, సురేందర్ రెడ్డి, నెల్లుట్ల నవీన్, సతీష్ రెడ్డి, వామన్, వినయ్ రెడ్డి, వెంకట చారి, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment