*రాంపల్లి ఎక్స్ రోడ్డులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 14
సోమవారం నాగారం పురపాలక సంఘం పరిధిలోని రాంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎస్.భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కె.చంద్రాశేఖర్ , సానిటరీ ఇన్స్ పెక్టర్ రాంరెడ్డి , మాజీ వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ కమీషనర్ ఎస్.భాస్కర్ రెడ్డి మరియు ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ వేడుకలు రాంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఉత్సాహంగా జరిగాయి.